Shoping Mall Story (షాపింగ్ మాల్ కథ) | Telugu Moral Stories
Shoping Mall Story (షాపింగ్ మాల్ కథ) | Telugu Moral Stories
*ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఒక సెలబ్రిటీ వచ్చారు. గుంపులో ఎక్కడ ఉన్నా సెలబ్రిటీతో దూరం నుండైనా తాను ఒకే ఫ్రేమ్‌లో ఉండేలా సెల్ఫీ తీసుకోవడానికి ఎవరికివారు బిజీగా ప్రయత్నిస్తున్నారు.*
అదో అవార్డు ఫంక్షన్. స్పెషల్ గెస్ట్ గా ఓ మినిస్టర్ వచ్చారు. సమాజంలో ఎవరికి వారికి వారి స్థాయిలో కాస్తోకూస్తో పేరున్న వారు కూడా ఆయన కనుసన్నల్లో పడటానికి నవ్వు మొహం పెట్టుకుని, అతని వైపు చూస్తూ ఉన్నారు.
ఇలాంటివి మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. అభిమానం కలిగి ఉండటంలో తప్పేమీ లేదు. కానీ నిన్ను నువ్వు కోల్పోయి, నీ అస్తిత్వాన్ని కోల్పోయి ఎవరి ప్రాపకం కోసమో దిగజారాల్సిన పనిలేదు.
గుండెల్లో నీ పట్ల నీకు ఎవరెస్టంత గౌరవం ఉంటే ఇతరుల్ని దైవదూతల్లా భావించవు.. వాళ్లు కూడా నీలాంటి మనుషులే అన్న భావన స్పష్టంగా నీ మనసుకు అర్థమవుతుంది.
ఎక్కడి వాళ్ళు వీళ్లంతా.. నిజమే వాళ్లు గొప్ప స్థానాల్లో ఉండొచ్చు. నిన్ను చూసి పలకరిస్తే, నువ్వూ అదే చిరునవ్వుతో పలకరించు. కనీసం నీ వైపు చూడను కూడా చూడని వాళ్ల కళ్లల్లో పడాలని ఎందుకు తాపత్రయపడతావు?
ఇలా చేసి నిన్ను నువ్వు కించపరచుకుంటున్నావని తెలీట్లేదా? నీ హుందాతనం నువ్వు కాపాడుకో. నీ ముందు సియం ఉన్నా, పియం ఉన్నా, అమెరికా అధ్యక్షుడు ఉన్నా అసలు పట్టించుకోకు. దీన్ని ఇగోగా భావించకు, సెల్ఫ్ రెస్పెక్ట్‌గా భావించు. పిచ్చి పిచ్చి అభిమానాలు, అర్హత లేనివారి పట్ల ఉండే భ్రమలూ అన్నీ తొలగిపోయి నీ పై నీకు గౌరవం పెరుగుతుంది.
Home Page Learn Telugu Learn English YouTube Videos Telugu Moral Stories
Telugu Christian Songs Lyrics Computer Shortcut Keys