Telugu Saametalu- తెలుగు సామెతలు – ఋ,ఎ,ఏ,ఒ,ఓ అక్షరాలు || Telugu Grammar

Proverbs in Telugu తెలుగు సామెతలు
Proverbs in Telugu తెలుగు సామెతలు

Telugu Saametalu- తెలుగు సామెతలు –  ఋ అక్షరం

|| Telugu Grammar

 

ఋ- No Data Availabe

Telugu Saametalu- తెలుగు సామెతలు –  ఎ అక్షరం

|| Telugu Grammar

ఎ

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
ఎంత చెట్టుకి అంత గాలి
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు
ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి?
ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
ఎద్దు పుండు కాకికి ముద్దు
ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు
ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
ఎవడి బ్లాగుకు వాడే సుమన్ అని

Telugu Saametalu- తెలుగు సామెతలు – ఏ అక్షరం

|| Telugu Grammar

ఏ

ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
ఏనుగులు పడితే ఏనుగులే లేపాలి కాని పీనుగుల వల్ల కాదు
ఏమండీ కరణం గారూపాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని
ఏరు ఏడామడ ఉండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య

 

Telugu Saametalu- తెలుగు సామెతలు –  ఒ అక్షరం

|| Telugu Grammar

ఒ

ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
ఒక దెబ్బకు రెండు పిట్టలు
ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పే
ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు

 

Telugu Saametalu- తెలుగు సామెతలు –  ఓ అక్షరం

|| Telugu Grammar

ఓ

ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
ఓర్చినమ్మకు తేట నీరు
ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *