Telugu Saametalu- తెలుగు సామెతలు || Telugu Grammar | సామెతలు – అ అక్షరం
Telugu Saametalu- తెలుగు సామెతలు || Telugu Grammar | సామెతలు – అ అక్షరం
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. “సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు” అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని “సూక్తులు”, “జనాంతికాలు”, “లోకోక్తులు” అని కూడా అంటుంటారు
పిల్లికి ఇరకాటం ఎలుకకు ప్రాణ సంకటం
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. “సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు” అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి.
ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు (“ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు”).
పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు (“ఊరక రారు మహానుభావులు“).
సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును (“క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి“).
ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును (“ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి”, “కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే“).
ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును (“అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది“).
వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును (“మనసుంటే మార్గముంటుంది“)
ప్రమాదమును హెచ్చరించవచ్చును (“చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి“).
వాదనకు ముక్తాయింపు పాడవచ్చును (“తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి“).
హాస్యాన్ని పంచవచ్చును (“ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట“).
సామెతల జాబితా:
అ
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట
అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
అందని పండ్లకు అర్రులు చాచినట్లు
అందని ద్రాక్షలు పుల్లన
అందితే సిగ అందకపోతే కాళ్ళు
అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు
అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు
అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
అంధుడికి అద్దం చూపించినట్లు
అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
అగ్నికి వాయువు తోడైనట్లు
అటునుండి నరుక్కు రా
అడకత్తెరలో పోకచెక్క
అడగందే అమ్మ అయినా పెట్టదు
అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
అడుసు తొక్కనేల కాలు కడగనేల
అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న
అతి వినయం ధూర్త లక్షణం
అతిరహస్యం బట్టబయలు
అత్త సొమ్ము అల్లుడు దానం
అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
అద్దం అబద్ధం ఆడుతుందా !
అనగా అనగా రాగం తినగా తినగా రోగం
అనువుగాని చోట అధికుల మన రాదు
అనుమానం పెనుభూతం
అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?
అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
అప్పనుచూడబోతే రెప్పలు పోయినై
అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది
అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?
అప్పిచ్చువాడు వైద్యుడు
అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు
అప్పు నిప్పులాంటిది…
అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?
అప్పు చేసి కొప్పు తీర్చిందట
అప్పుచేసి పప్పు కూడు
అప్పులేని వాడే అధిక సంపన్నుడు
అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
అభ్యాసము కూసువిద్య
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం
అరచేతిలో వైకుంఠం చూపినట్లు
అవ్వాకావలెను బువ్వా కావలెను
అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు…
అరిచే కుక్క కరవదు
అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు
అర్దరాత్రి మద్దెల దరువు
అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా…
అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు
అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
అడుక్కునేవాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు.
“జాతీయములు” లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.
ఆంగ్ల భాషలో “జాతీయము” అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు “చేతికి ఎముక లేదు” అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం “ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి” కాని ఈ జాతీయానికి అర్ధం “ధారాళంగా దానమిచ్చే మనిషి” అని.
జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్ధం – idiom as words collocated together happen to become fossilized, becoming fixed over time.. అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. “నీళ్ళోసుకోవడం”, “అరికాలి మంట నెత్తికెక్కడం”, “డైలాగు పేలడం”, “తు చ తప్పకుండా” – ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.
Related Posts
Telugu- తెలుగు
Building Words in Telugu || Learn Telugu || Telugu Words – 07
