Telugu Saametalu – తెలుగు సామెతలు – ఇ,ఈ,ఉ,ఊ అక్షరాలు || Telugu Grammar
Telugu Saametalu- తెలుగు సామెతలు – ఇ అక్షరం
|| Telugu Grammar
ఇ
ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా?
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
ఇంటికన్నా గుడి పదిలం
ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
ఇంట్లో పిల్లి వీధిలో పులి
ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
ఇద్దరు ముద్దు ఆపై వద్దు
ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
ఇల్లలకగానే పండగకాదు
ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
ఇల్లు ఇరుకుగా ఉండాలి, పెళ్ళాం ఛ0ఢాలంగా ఉండాలి
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం
ఇల్లు పీకి పందిరి వేసినట్లు
ఇసుక తక్కెడ పేడ తక్కెడ
ఇల్లలకగానే పండగ కాదు
ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదు
Telugu Saametalu- తెలుగు సామెతలు – ఈ అక్షరం
|| Telugu Grammar
ఈ
ఈశ్వరుడుకి విభూది లెకుంటె పార్వతి పాండ్స్ అడిగినట్లు
Telugu Saametalu- తెలుగు సామెతలు – ఉ అక్షరం
|| Telugu Grammar
ఉ
ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
ఉపాయం లేని వాడిని ఊళ్ళోనంచి వెళ్ళగొట్టమన్నారు
ఉన్న మాటంటే ఉలుకెక్కువ
ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు
Telugu Saametalu- తెలుగు సామెతలు – ఊ అక్షరం
|| Telugu Grammar
ఊ
ఊరు ఊరు పోట్లాడుకుని మంగలం మీద పడి ఏడ్చినట్టు
ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి
ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి
ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు
ఊరికి ఉపకారి ఆలికి అపకారి
ఊరికి చేసిన ఉపకారం శవానికి చేసిన శృంగారం వృదా.
Related Posts
Telugu Saametalu- తెలుగు సామెతలు || Telugu Grammar | సామెతలు – ఆ అక్షరం
Sandulu in Telugu_సంధులు తెలుగు లో
