Telugu Saametalu- తెలుగు సామెతలు || Telugu Grammar | సామెతలు – ఆ అక్షరం
Telugu Saametalu- తెలుగు సామెతలు || Telugu Grammar |
సామెతలు – ఆ అక్షరం
ఆ
ఆ తాను ముక్కే
ఆంతా ఆతాను ముక్కే
ఆ మొద్దు లోదే ఈ పేడు
ఆంబోతులా పడి మేస్తున్నావు
ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు
ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
ఆకారం చూసి ఆశపడ్డానే కానీ… అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట…
ఆకారపుష్టి నైవేద్యనష్టి
ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
ఆకులేని పంట అరవైఆరు పుట్లు…
ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు…
ఆడబోయిన తీర్థమెదురైనట్లు
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
ఆత్రగాడికి బుద్ది మట్టం
ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
ఆదిలోనే హంసపాదు
ఆపదలో మొక్కులు… సంపదలో మరపులు
ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు
ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి
ఆయనే ఉంటే మంగలి ఎందుకు
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆలస్యం అమృతం విషం
ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే… చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేయునా?
